ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది! | Oprah Winfrey earns USD 12 million for one tweet | Sakshi
Sakshi News home page

ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది!

Jan 28 2016 9:36 AM | Updated on Sep 3 2017 4:29 PM

ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది!

ఒక్క ట్వీట్‌తో 81.77 కోట్లు సంపాదించింది!

బ్రెడ్డుముక్కను తింటూ కూడా బరువు ఎలా తగ్గించుకోవచ్చో చెప్తూ చేసిన ఓ ట్వీట్‌కు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే అక్షరాల 12 మిలియన్ డాలర్ల (రూ. 81.77 కోట్లు) సంపాదించింది

లండన్‌: బ్రెడ్డుముక్కను తింటూ కూడా బరువును ఎలా తగ్గించుకోవచ్చో చెప్తూ పెట్టిన ఓ ట్వీట్‌కు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే అక్షరాల 12 మిలియన్ డాలర్లు (రూ. 81.77 కోట్లు) సంపాదించింది. 'వెయిట్‌ వాచర్స్' కంపెనీ తరఫున బ్రెడ్‌ తింటూ 26 పౌండ్ల బరువును ఎలా తగ్గవచ్చో తెలిపే ఓ వీడియోను ఆమె ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. ఈ కంపెనీలో మీడియా మొఘల్‌గా పేరొందిన విన్‌ఫ్రేకు 6 మిలియన్‌ డాలర్ల వాటా ఉండగా.. ఈ ఒక్క ట్వీట్‌ వల్ల ఆమె సంపద 18 శాతం పెరిగి 12 మిలియన్‌ డాలర్లకు చేరింది.

దీంతో 'వెయిట్ వాచర్స్' కంపెనీలో ఆమె షేర్‌ విలువ ఒకే ఒక్క గంటలోనే 2.10 శాతానికి పెరిగిందని 'ఫిమెల్ ఫస్ట్‌' మీడియా సంస్థ తెలిపింది. మల్టీ మిలియన్ డాలర్ ట్వీట్‌గా హల్‌చల్  చేసిన ఈ ట్వీట్‌లో 'బ్రెడ్‌ తినండి. బరువు తగ్గండి. ఏంటి? నిజమా! అవును. నాతోపాటు ఈ 30 సెకండ్ల వీడియో క్లిప్పును చూడండి. నేను 26 పౌండ్ల బరువు తగ్గాను. నేను ప్రతిరోజూ బ్రెడ్ తింటాను' అని విన్‌ఫ్రే పేర్కొంది.

హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ హడ్సన్, జెన్సీ మెక్‌క్యాథీ తరహాలోనే గత అక్టోబర్‌ నుంచి 'వెయిట్‌ వాచర్స్‌' కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా విన్‌ఫ్రే నియమితురాలైంది. ఇందుకుగాను ఆమెకు లభించే వాటాను మార్కెట్‌లో అమ్మితేగానీ విన్‌ఫ్రేకు డబ్బురూపంలో ఆ సొమ్ము అందదని మార్కెట్ వర్గాలంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement