అదే నా వీక్ నెస్ : ప్రియమణి | Sakshi
Sakshi News home page

అదే నా వీక్ నెస్ : ప్రియమణి

Published Thu, Nov 5 2015 6:56 PM

అదే నా వీక్ నెస్ : ప్రియమణి

ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. దానికి అందాల తారలేం అతీతం కాదు. బుజ్జి బుజ్జి కుక్కపిల్లలు తన వీక్నెస్ అంటూ దక్షిణాది హీరోయిన్ ప్రియమణి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అది ఎంత బలహీనతంటే.. రోడ్డు పక్కన చెత్తలో తిరుగాడుతున్న కుక్కపిల్లను చూసి అమాంతం వెళ్లి అక్కున చేర్చుకున్నారు ఈ స్టార్ హీరోయిన్.

తను దిగిన ఓ హోటల్ రూమ్లో ఏమాత్రం హడావుడి లేకుండా సాదాసీదాగా నైట్ డ్రెస్లో ఉన్న ప్రియమణి.. కుక్కపిల్లను చూడగానే రోడ్డు మీదకు పరుగు తీశారు. ఓ స్టార్ హీరోయిన్ తన స్టార్డమ్ పక్కనబెట్టి చిన్ని కుక్కపిల్ల కోసం ఇలా  బయటకు రావడం చూస్తుంటే.. ఆమెకు కుక్కపిల్లలంటే ఎంత ఇష్టమో అర్థమౌతుంది.

Advertisement
Advertisement