ఆ ఫొటోషూట్‌ వల్ల చాన్స్‌ వచ్చింది | nuvvu thopu raa teaser release | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోషూట్‌ వల్ల చాన్స్‌ వచ్చింది

Jul 15 2018 12:42 AM | Updated on Jul 15 2018 12:42 AM

nuvvu thopu raa teaser release - Sakshi

డి. శ్రీకాంత్, హరినాథ్‌ బాబు, నిరోషా, విజయ్‌ దేవరకొండ, సుధాకర్‌ కోమాకుల, నిత్యా శెట్టి

‘‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాకి నేను ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు సుధాకర్‌ నన్ను బాగా రిసీవ్‌ చేసుకొని సపోర్ట్‌ చేసాడు. అతను చేసిన ఫొటోషూట్‌ స్టిల్స్‌ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకి నాకు ఛాన్స్‌ రావడానికి కారణం. ‘నువ్వు తోపురా’ మూవీ లైన్‌ విన్నప్పుడే పెద్ద హిట్‌ అనే ఫీలింగ్‌ కలిగింది. ట్రైలర్‌ చాలా బాగుంది. టికెట్స్‌ కొని మా ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తా’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. సుధాకర్‌ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా నిరోషా ముఖ్య పాత్రలో హరినాథ్‌ బాబు బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. బేబీ జాహ్నవి సమర్పణలో డి.శ్రీకాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు.

హీరో సుధాకర్‌ మాట్లాడుతూ– ‘‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా తర్వాత చాలా అవకాశాలొచ్చినా కొన్ని కారణాల వల్ల చేయలేదు. యారొగెంట్‌గా ఉండే ఓ  కుర్రాడు అమెరికా వెళ్లి జీవితంలో ఎలా ఎదిగాడు అన్నది మెయిన్‌ స్టోరీ’’ అన్నారు. ‘‘కృష్ణవంశీ, వైవీఎస్‌ చౌదరిగార్ల వద్ద డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్లో పని చేసాను. నా తొలి సినిమా షూటింగ్‌ అమెరికాలో జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు హరినాథ్‌ బాబు. ‘‘ప్రతి మనిషి జీవితంలో జరిగిన స్టోరీ ఇది’’ అన్నారు నిర్మాత డి.శ్రీకాంత్‌. ‘‘12 ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నాను. పుట్టింటికి వచ్చిన ఫీలింగ్‌ కలిగింది’’ అన్నారు నటి నిరోషా. చిత్ర కథానాయిక నిత్యా శెట్టి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement