‘అరవింద సమేత’ టీజర్‌ ఎ‍ప్పుడంటే? | Is NTRs Aravindha Sametha Teaser Will Be Released On 15th August | Sakshi
Sakshi News home page

Jul 6 2018 10:57 AM | Updated on Jul 6 2018 10:59 AM

Is NTRs Aravindha Sametha Teaser Will Be Released On 15th August - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత’. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యుల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను ఓ రేంజ్‌లో చిత్రీకరించారని టాక్‌. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొంత భాగాన్ని షూట్‌ చేయాలని చిత్ర బృందం నిర్ణయించిందని తెలుస్తోంది. 

అందుకోసం వరంగల్‌లోని భద్రకాళీ ఆలయ పరిసర ప్రాంతాల్ని పరిశీలిస్తున్నట్లు టాక్‌. చకచకా షూటింగ్‌ను పూర్తిచేసి దసరా కానుకగా సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌పోస్టర్స్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్టు 15న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement