ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విశ్వరూపం2 ట్రైలర్‌

NTR Unveil Kamal Hassan Vishwaroopam 2 Trailer On 11th June - Sakshi

కమలహాసన్‌​ విశ్వరూపం సినిమా ఎంతటి వివాదాలను సృష్టించిందో అందరికి తెలిసిందే. చివరకు సినిమా విడుదల విషయంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది.  ఎప్పుడో రావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. 

కమల్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వరూపం 2 సినిమా జూన్‌ 11 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా సోమవారం సాయంత్రం 5 గంటలకు మూడు భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. హిందీ వెర్షన్‌ను ఆమిర్‌ ఖాన్‌, తమిళ వెర్షన్‌ను శృతి హాసన్‌, తెలుగు వెర్షన్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా, ఆండ్రియా కమలహాసన్‌కు జోడిగా నటించగా, జిబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top