న్యూ లుక్‌లో ఎన్టీఆర్‌

Ntr New Look For Trivikram Srinvias Film - Sakshi

జై లవ కుశ సినిమాతో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత‍్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ లో కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టుగా స్లిమ్‌ లుక్‌ లోకి మారిపోయేందుకు హాలీవుడ్‌ ఫిజికల్ ట్రైనర్‌ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ టెంపర్‌ సినిమాలో కన్నా ఫిట్‌ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

తాజాగా ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్‌ స్లిమ్‌గా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన శ్రద్ధా కపూర్‌, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top