NTR Mahanayakudu Release Date: NTR Biopic Part 2 Release Date Confirmed - Sakshi
Sakshi News home page

‘మహానాయకుడు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Feb 12 2019 5:03 PM | Updated on Feb 12 2019 8:06 PM

NTR Mahanayakudu Releasing On 22nd February - Sakshi

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’.. సంక్రాంతి బరిలోకి దిగి ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ ని సిద్దం చేస్తున్నాడు బాలకృష్ణ. మొదటి భాగం చేదు అనుభవాన్ని మిగల్చగా.. రెండో భాగంపై చిత్రయూనిట్‌ శ్రద్ద పెట్టినట్టు సమాచారం. 

ఫిబ్రవరి మొదటి వారంలోనే ‘మహానాయకుడు’ని విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రమైనా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement