‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ వాయిదా..! | Ntr Mahanayakudu Postponed | Sakshi
Sakshi News home page

Dec 19 2018 4:17 PM | Updated on Dec 19 2018 4:17 PM

Ntr Mahanayakudu Postponed - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న బయోపిక్‌ మూవీ యన్‌.టి.ఆర్‌. క్రిష్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుంది. తొలి భాగం కథానాయకుడులో ఎన్టీఆర్‌ సినీ జీవిత విశేషాలు. రెండో భాగం మహానాయకుడులో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం చూపించనున్నారు. ముందు ఈ రెండు భాగాలను రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.

తొలి భాగం యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు జనవరి 9న, యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. తాజాగా యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు రిలీజ్‌ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 24న కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 7న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement