ఎన్టీఆర్తో అమైరా | Ntr, Koratala siva movie title janata gaage heroine amyra | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్తో అమైరా

Oct 25 2015 9:19 AM | Updated on Apr 8 2019 7:50 PM

ఎన్టీఆర్తో అమైరా - Sakshi

ఎన్టీఆర్తో అమైరా

చాలా రోజులుగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్గా ఎనౌన్స్ చేయకపోయినా ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను కొరటాల శివ డైరెక్ట్...

చాలా రోజులుగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో  సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్గా ఎనౌన్స్ చేయకపోయినా ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అంతేకాదు తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా టైటిల్ అంటూ ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలోనటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు 'జనతా గ్యారేజ్' అనే టైటిల్ను ఫైనల్ చేశారట. 'అన్నీ రిపేర్ చేయబడును' అనే ట్యాగ్ లైన్  కూడా పెట్టినట్టుగా చెబుతున్నారు. టైటిల్ను బట్టి చూస్తే, ఎన్టీఆర్ ఈ సినిమాలో మెకానిక్గా కనిపించనున్నాడన్న విషయం అర్థమవుతోంది.

కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడు లాంటి బ్లాక్బస్టర్ సక్సెస్ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు హీరోయిన్గా శృతి హాసన్ ను తీసుకోవాలని భావించినా, ప్రస్తుతం ధనుష్ సరసన అనేకుడు సినిమాలో నటించిన అమైరా దస్తర్ పేరు వినిపిస్తోంది. నాన్నకు ప్రేమతో రిలీజ్ తరువాత జనవరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement