ఎన్టీఆర్‌ టఫ్‌గా కనిపిస్తాడట కానీ..  | NTR Aravinda Sametha Lyrical Song Released | Sakshi
Sakshi News home page

Sep 15 2018 5:23 PM | Updated on Sep 16 2018 5:57 AM

NTR Aravinda Sametha Lyrical Song Released - Sakshi

అవును ఎన్టీఆర్‌ టఫ్‌గా కనిపిస్తాడట కానీ మాట వింటారని పూజా హెగ్డే అంటోంది. పూజా ఈ మాటలు అన్నది బయట కాదు సినిమాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘అరవింద సమేత’. ఎన్టీఆర్‌ లుక్‌, టీజర్‌ రిలీజ్‌ చేసినప్పటి నుంచీ అభిమానులు సినిమా విడుదల కోసం మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి ‘అనగనగనగా’ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ మొదలయ్యే ముందు పూజా హెగ్డే ఎన్టీఆర్‌తో ‘టఫ్‌గా కనిపిస్తారు.. కానీ మాట వింటారు’ అని అంటారు. ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌లో ఎన్టీఆర్‌ లుక్స్‌ అదిరిపోయేలా ఉన్నాయి. తమన్‌ అందించిన సంగీతం, అర్మాన్‌ మాలిక్‌ గాత్రం, పూజ హెగ్డే అందం అన్నీ హైలెట్‌గా నిలిచాయి. అరవింద పాత్రను పోషిస్తున్న పూజా హెగ్డేను ప్రేమలో దించడానికి ఎన్టీఆర్‌ పాడుతున్న ఈ పాట, పడుతున్న పాట్లు ఈ పాటలో కనిపిస్తున్నాయి. మొత్తానికి మరో కొత్త ఎన్టీఆర్‌ను అభిమానులకు అందించబోతున్నాడు త్రివిక్రమ్‌. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అందించేందుకు ప్లాన్‌చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement