అక్షయ్‌ రీల్‌ హీరోనే కాదు..రియల్‌ హీరో కూడా!

Now Akshay Kumar Called As Real Hero After Rescuing Unconscious Man - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఖిలాడి అక్షయ్ కుమార్‌ కేవలం ‘రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో కూడా’  అంటూ అతడి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఓ టీవీ షోకి గెస్ట్‌గా వెళ్లిన అక్షయ్‌ ఆ షోలో పాల్గొన ఓ వ్యక్తికి చేసిన సహాయమే ఇందుకు కారణం. వివరాలు.. మనీష్‌ పాల్‌ రూపొందించిన ‘మూవీ మస్తీ’ అనే కొత్త షోకి అక్కీ అతిధిగా వెళ్లాడు. ఈ షోలో అలీ ఆస్గర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి స్కిట్‌ చేశారు. ఇందులో భాగంగా వాళ్లు.. ఓ రోప్‌ సహాయంతో కిందకు జారుతూ వచ్చి.. కింద ఉన్న నీటి తోట్టిలో నిలబడాలి. కాగా స్కిట్‌ చేస్తున్న సమయంలో అలీ ఆస్గర్‌తో పాటు పట్టీలో ఉన్న మరో వ్యక్తి స్పృహ కోల్పోయి.. వెనక్కి పడబోతుంటే పక్కనే ఉన్న అలీ గుర్తించి అతడిని కాపాడే ప్రయత్నం చేశాడు. 

ఊహించని పరిణామంతో కంగుతిన్న షో సిబ్బంది స్టేజ్‌పైకి పరుగెత్తుకు వచ్చారు. ఈ క్రమంలో వారితో పాటు అక్షయ్‌ కూడా స్టేజీ పైకి పరుగెత్తాడు. వెంటనే నీటి తొట్టి పైకెక్కి ఆ వ్యక్తిని తన కాళ్లపై పడుకోబెట్టుకొని కిందకు దించడంలో సహాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో... ‘అక్షయ్‌ అద్భుతమైన నటుడు.. దాన ధర్మాలు చేస్తాడు. జవాన్లను ఆదుకుంటాడు. అలాగే అందరికీ సాయం చేయడంలో ముందుంటాడు’  అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక తన సినిమాల్లోని స్టంట్స్‌ సీన్లలో తానే స్వయంగా నటించి యాక్షన్‌ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖిలాడి.. 2008లో వచ్చిన ‘ఖత్రోన్‌ కే ఖిలాడి’ అనే ఫియర్‌ ఫ్యాక్టర్‌ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top