'అభిమానులు ఆందోళన చెందొద్దు' | Not such a major injury: Aamir Khan | Sakshi
Sakshi News home page

'అభిమానులు ఆందోళన చెందొద్దు'

Nov 16 2015 4:37 PM | Updated on Apr 3 2019 6:23 PM

'అభిమానులు ఆందోళన చెందొద్దు' - Sakshi

'అభిమానులు ఆందోళన చెందొద్దు'

తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన పడొద్దని బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ తెలిపాడు.

ముంబై: తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన పడొద్దని బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ తెలిపాడు. తనకు పెద్ద గాయమేమీ కాలేదని, వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ షూటింగ్ లో పాల్గొంటానని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 50 ఏళ్ల ఆమిర్ ఖాన్ ప్రస్తుతం 'దంగల్' సినిమాలో నటిస్తున్నాడు.

మల్లయోధుడు మహవీర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ పంజాబ్ లోని లూథియానాలో జరుగుతుండగా కండరాలు పట్టేయడంతో ఆమిర్‌ ఖాన్ ఇబ్బంది పడ్డాడు. రెజ్లింగ్ సీన్ లో నటిస్తుండగా భుజం కండరాలు పట్టేశాయి. వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆమిర్- ముంబైకి తిరిగివచ్చాడు. 'దంగల్' సినిమాకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement