ప్రచారం లేదు.. పోటీ లేదు! | Not contesting polls or campaigning for any political party | Sakshi
Sakshi News home page

ప్రచారం లేదు.. పోటీ లేదు!

Mar 22 2019 12:13 AM | Updated on Mar 22 2019 12:13 AM

Not contesting polls or campaigning for any political party - Sakshi

సల్మాన్‌ఖాన్‌

‘‘నేను ఎన్నికల్లో ప్రచారం చేయను. పోటీ చేయను’’ అని బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు. ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటింగ్‌ అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని జాతీయ స్థాయిలో చాలామంది సెలబ్రిటీలకు ట్వీట్స్‌ చేశారు. అందులో ఒకరైన సల్మాన్‌ ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయుడు ఎలక్షన్స్‌లో పాల్గొనాలి. మంచి ప్రభుత్వం వచ్చే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి’’ అని గురువారం ట్వీట్‌ చేశారు.

అంతే.. దేశంలో ఎన్నికల ఫీవర్‌ ఫుల్‌గా ఉండటంతో సల్మాన్‌ ఏదో ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలు ఫైనల్‌గా సల్మాన్‌ చెవిలో పడ్డాయి. ‘‘ప్రచారంలో ఉన్నట్లుగా నేను ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదు. అలాగే ఏ రాజకీయ పార్టీకీ మద్దుతుగా ప్రచారం కూడా చేయను’’ అని పేర్కొన్నారు సల్మాన్‌. ఇక సినిమాల విషయానికి వస్తే... సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం ‘భారత్‌’ ఈ రంజాన్‌కు రిలీజ్‌ కానుంది. అలాగే సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా సెప్టెంబర్‌లో స్టార్ట్‌ కానుంది. 2020 రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement