శర్వా.. ఆ సినిమా ఏమైంది..? | No Updates From Sharwanand, Sudheer Varma Movie | Sakshi
Sakshi News home page

Nov 10 2018 9:32 AM | Updated on Nov 10 2018 11:24 AM

No Updates From Sharwanand, Sudheer Varma Movie - Sakshi

యంగ్ జనరేషన్‌లో డిఫరెంట్‌ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న హీరో శర్వానంద్‌. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచే డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వస్తున్న శర్వానంద్‌ కమర్షియల్ హీరోగానూ ప్రూవ్‌ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శర్వానంద్‌.
 

అయితే గత ఏడాది నవంబర్‌ లో శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఓ సినిమా ప్రారంభమైంది. అయితే ఓపెనింగ్‌ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినా తరువాత సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఏవీ బయటకు రాలేదు. ఇటీవల కొరియాలో భారీ షెడ్యూల్‌ ప్లాన్‌చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తరువాత మరే న్యూస్‌ రాలేదు.
 

అవుట్‌పుట్‌ అనుకున్న స్థాయిలో రాకపోవటంతో స్క్రీప్ట్‌ రీరైట్ చేయాల్సిందిగా దర్శకుడు సుధీర్‌ వర్మకు సూచించాడట శర్వానంద్‌. అందుకే సినిమా ఆలస్యం అయిందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ విషయం చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. శర్వా హీరోగా తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement