‘సీత’ సందడే లేదేంటి! | No Update From Bellamkonda Sai Srinivaas Next Film Seetha | Sakshi
Sakshi News home page

‘సీత’ సందడే లేదేంటి!

Mar 27 2019 1:43 PM | Updated on Aug 3 2019 12:45 PM

No Update From Bellamkonda Sai Srinivaas Next Film Seetha - Sakshi

హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి భారీ చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ యువ కథానాయకుడు కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ తరువాత తేజ దర్శకత్వంలో సీత సినిమాను ప్రారంభించాడు.

గత ఏడాది జూలైలోనే తేజ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు సాయి శ్రీనివాస్‌. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే కవచం సినిమాను తెరకెక్కించి రిలీజ్ కూడా చేశారు. కవచం గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా సీతకు సంబంధించి ప్రమోషన్‌ ప్రారంభం కాలేదు. గతంలో ఏప్రిల్ 25న సినిమా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రకటించినా ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు.

ఇప్పటి వరకు రెండు పోస్టర్స్‌ తప్ప సినిమా ప్రమోషన్ ప్రారంభం కాలేదు. దీంతో సీత ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. సాయి శ్రీనివాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది. అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement