
‘పెదరాయుడు’ తర్వాత...
రజనీకాంత్ తాజా సినిమా వివరాలిప్పుడు అధికారికంగా వెల్లడయ్యాయి. ‘మద్రాస్’, ‘అట్ట కత్తి’ చిత్రాల ఫేమ్ రంజిత్
రజనీకాంత్ తాజా సినిమా వివరాలిప్పుడు అధికారికంగా వెల్లడయ్యాయి. ‘మద్రాస్’, ‘అట్ట కత్తి’ చిత్రాల ఫేమ్ రంజిత్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. తమిళంలో అగ్రనిర్మాతగా పేరొందిన ‘కలైపులి’ ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ తమిళ, తెలుగు భాషలు రెంటిలోనూ ఏకకాలంలో రూపొందనుంది. రజనీకి తెలుగునాట కూడా సూపర్ క్రేజ్ ఉంది. దాదాపుగా ఆయన సినిమాలన్నీ తెలుగులో అనువాదమవుతుంటాయి. తనకు అత్యంత సన్నిహితుడైన మోహన్‌బాబు కోసం 1995లో ‘పెదరాయుడు’లో అతిథి పాత్ర చేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమా చేయనున్నారు రజనీ. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతామని థాను బుధవారం అధికారికంగా వెల్లడించారు.