Guest role
-
లోకేశ్ కనగరాజ్ సినిమా: విజయ్‌కి గెస్ట్‌గా కమల్
విజయ్‌కి కమల్‌హాసన్ గెస్ట్ కానున్నారట. కోలీవుడ్‌లో ప్రచారంలో ఉన్న వార్త ఇది. ‘మాస్టర్’ వంటి హిట్ తర్వాత విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలోనే కమల్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారని టాక్. కమల్ గత చిత్రం ‘విక్రమ్’కి లోకేశ్ కనగరాజ్ దర్శకుడనే విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్టయింది. మూడువందల కోట్లకు పైగా వసూలు చేసి, సంచలనం సాధించింది. ఒక సీనియర్ నటుడు నటించిన చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం అంటే సంచలనమే కదా. అందుకే విజయ్ హీరోగా తాను రూపొందించనున్న తాజా చిత్రంలో గెస్ట్ రోల్ చేయమని లోకేశ్ కోరితే కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘పెదరాయుడు’ తర్వాత...
రజనీకాంత్ తాజా సినిమా వివరాలిప్పుడు అధికారికంగా వెల్లడయ్యాయి. ‘మద్రాస్’, ‘అట్ట కత్తి’ చిత్రాల ఫేమ్ రంజిత్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. తమిళంలో అగ్రనిర్మాతగా పేరొందిన ‘కలైపులి’ ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ తమిళ, తెలుగు భాషలు రెంటిలోనూ ఏకకాలంలో రూపొందనుంది. రజనీకి తెలుగునాట కూడా సూపర్ క్రేజ్ ఉంది. దాదాపుగా ఆయన సినిమాలన్నీ తెలుగులో అనువాదమవుతుంటాయి. తనకు అత్యంత సన్నిహితుడైన మోహన్‌బాబు కోసం 1995లో ‘పెదరాయుడు’లో అతిథి పాత్ర చేశారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమా చేయనున్నారు రజనీ. త్వరలోనే చిత్రీకరణ మొదలు పెడతామని థాను బుధవారం అధికారికంగా వెల్లడించారు.