రావడం పక్కా | No change in Kavacham's release date | Sakshi
Sakshi News home page

రావడం పక్కా

Nov 29 2018 2:45 AM | Updated on Nov 29 2018 2:45 AM

No change in Kavacham's release date - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కవచం’.   కాజల్‌ అగర్వాల్, మెహరీన్‌ కథానాయికలు. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని(నాని) నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్‌ 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే ‘కవచం’ విడుదల తేదీ వాయిదా పడిందంటూ ఆన్‌లైన్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర వర్గాలు రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ ఇచ్చారు.‘కవచం’ విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదు.

ముందుగా చెప్పినట్టు డిసెంబర్‌ 7వ తేదీనే విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటించడంతో అందరి అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సాయి శ్రీనివాస్‌ తొలిసారి పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘కవచం’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే 10 మిలియన్‌ డిజిటల్‌ వ్యూస్‌ వచ్చాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. హర్షవర్ధన్‌ రానే, బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్, పోసాని కృష్ణ మురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు, సహ నిర్మాత: చాగంటి సంతయ్య.

Advertisement
 
Advertisement
Advertisement