అందుకే ఐరన్‌ లేడీ చేస్తున్నా! | Nithya Menen OPENS up on doing Jayalalithaa biopic | Sakshi
Sakshi News home page

అందుకే ఐరన్‌ లేడీ చేస్తున్నా!

Jul 13 2020 1:25 AM | Updated on Jul 13 2020 5:01 AM

Nithya Menen OPENS up on doing Jayalalithaa biopic  - Sakshi

నిత్యా మీనన్‌

దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్‌ నటిస్తున్న ‘ఐరన్‌ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్‌ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్‌ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై  సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది.

నా సందేహాన్ని ‘ఐరన్‌ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్‌. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్‌ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్‌ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement