‘ఆలస్యమైనా న్యాయం గెలిచింది’

Nirbhaya Convicts Hanged: Actor Mahesh Babu And OthersTweet - Sakshi

నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను శుక్ర‌వారం ఉరి తీసిన విషయం తెలిసిందే. తీహార్‌ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. ఏడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ న్యాయమే గెలిచిందంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్‌)

తాజాగా టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు స్పందించారు. ‘‘చాలా కాలం వేచి ఉన్నాం. న్యాయం జ‌రిగింది. నిర్భ‌య ఘ‌ట‌న‌పై ఇప్పుడు జ‌రిగిన విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. న్యాయం కోసం నిరంతర పోరాటం, కృషి చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు నా సెల్యూట్‌. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం పెరిగింది. ఇలాంటి దురాగ‌తాల‌కు స‌త్వ‌ర న్యాయం ద‌క్కాలి, బ‌ల‌మైన చ‌ట్టాలుండాలి’’ అని ట్వీట్‌ చేశారు. అలాగే మరో ట్వీట్‌లో మహమ్మారి కరోనాను అరికట్టేందుకు ఈ నెల 22న (ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపుకు అందరూ మద్ధతివ్వాలని కోరారు. (నిర్భయ కేసు: చివరి కోరికల్లేవ్‌ కానీ ఉరి తర్వాత!)

నిర్భయ కేసు దోషులును ఉరి తీశారు. అన్న వార్తతో ఈ రోజు ప్రారంభమైంది. న్యాయం జరిగింది.- తమన్నా

ఇలాంటి నమ్మశక్యంకాని వార్త. ఏడు సంవత్సరాల తరువాత, నిర్భయ కేసు దోషులను ఉరితీశారు. న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన నిర్భయ తల్లికి, న్యాయవాదికి నా వందనం - రవి తేజ

నిర్భయకు న్యాయం జరిగింది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఇది ఓ ఉదాహరణగా నిలవాలి. అఘాయిత్యాలకు ఒడిగట్టిన వారికి ఉరిశిక్ష విధించాలి. మహిళను గౌరవించండి. ఉరిశిక్షను ఇన్నేళ్లపాటు ఆలస్యం చేసిన వారు సిగ్గు పడాలి. జై హింద్‌ - రిషి కపూర్‌

ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడింది. చాలా సంవ్సరాల తర్వాత ఈ రోజు నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రిస్తారు. తాప్సీ

అలాగే ఈ ఘ‌ట‌న‌పై మరికొంత మంది తారలు కూడా స్పందించారు. శ్ర‌ద్ధాక‌పూర్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, ర‌వీనాటాండ‌న్‌, ప్రీతి జింటా, మధుర్‌ భండార్కర్‌ త‌దిత‌రులు వారి ట్విట‌ర్స్ అకౌంట్స్ ద్వారా నిర్భయకు న్యాయం జ‌రిగింది అంటూ ట్వీట్ చేశారు. (జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top