థ్రిల్‌ అయ్యారు | ngk movie success movie success meet | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ అయ్యారు

Jun 3 2019 1:24 AM | Updated on Jul 23 2019 11:50 AM

ngk movie success movie success meet - Sakshi

శ్రీ రాఘవ,సూర్య

సూర్య హీరోగా, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లుగా శ్రీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎన్‌జీకే’(నంద గోపాల కృష్ణ). డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్‌ తెలుగులో మే 31న విడుదలచేశారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌తో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న సందర్భంగా శ్రీ రాఘవ మాట్లాడుతూ– ‘‘వినూత్న పంథాలో తెరకెక్కిన ఇంటెన్స్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇందులో ఫస్ట్‌ హాఫ్‌లో హీరో, సెకండ్‌ హాఫ్‌లో విలన్‌గా సూర్య పాత్రని వైవిధ్యంగా చూపించాం. అదే ‘ఎన్‌జీకే’ చూసిన ఆడియన్స్‌ని థ్రిల్‌ అయ్యేలా చేసింది. సూర్యతో డిఫరెంట్‌ క్యారక్టర్‌ చేయించారని అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఎన్‌జీకే’ సాధించిన విజయం అటు సూర్యకి, ఇటు దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.  మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement