కొత్త జంట ముచ్చట తీర్చిన హీరో | Newly Wed Couple Posing At Mannat Of Shahrukh Khan Blessing | Sakshi
Sakshi News home page

Dec 15 2018 1:22 PM | Updated on Apr 3 2019 4:08 PM

Newly Wed Couple Posing At Mannat Of Shahrukh Khan Blessing - Sakshi

అభిమాన నటున్ని చూడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అభిమానం ఎక్కువైన కొందురు మాత్రం ఏకంగా సదరు హీరో ఇంటి ముందు పడిగాపులు కాసి మరీ దర్శనం భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ల అదృష్టం బాగుంటే దర్శనం లభిస్తుంది.. లేదంటే లేదు. అభిమానం ఎక్కువైన ఓ ముంబై జంట ఇలాంటి ప్రయోగమే చేసింది. చివరకూ విజయం సాధించింది కూడా.

వివరాలు.. ముంబైకి చెందిన ఓ జంటకు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ అంటే విపరీతమైన అభిమానం. ఎంత పిచ్చి అంటే  వివాహం అయిన వెంటనే అందురూ దైవ దర్శనం నిమిత్తం గుడికి వెళ్లడం సాధరణం. కానీ వీరు మాత్రం పెళ్లయిన వెంటనే తమ అభిమాన హీరో షారుక్‌ నివాసం అయిన మన్నత్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ షారుక్‌ ఖాన్‌ సిగ్నేచర్‌ మూవ్‌మెంట్‌ పోజ్‌లో భార్యభర్తలిద్దరూ నిల్చూని.. షారుక్‌ దర్శనం కోసం ఎదురు చూడసాగారు. షాకింగ్‌.. వారిని షారుక్‌ ఖాన్‌ చూడటమే కాక​ హాయ్‌ కూడా చెప్పడంట. మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే షారుక్‌ ట్విట్టర్‌ ద్వారా సదరు దంపతులకు ఆశీర్వాదాలు కూడా తెలిపారు. ఇంకేముంది ఆనందంలో ఉక్కిరి బిక్కిరవుతున్నారు కొత్త జంట.

అయితే వీరు ఈ ఏడాది జూన్‌లోనే సదరు జంట ‘డిసెంబరులో మా వివాహం.. మీ ఆశీర్వాదం కావాలం’టూ షారుక్‌ ఖాన్‌కు ట్విట్టర్‌లో మెసేజ్‌ పెట్టారు. అయితే షారుక్‌ ఆ ట్వీట్‌ చూశాడో, లేదో కానీ.. కొత్త జంట ముచ్చట తీర్చి.. వారికి మరింత సంతోషాన్ని కలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement