ప్రేమ పరీక్ష | New telugu movie updates | Sakshi
Sakshi News home page

ప్రేమ పరీక్ష

Feb 24 2019 2:01 AM | Updated on Feb 24 2019 2:01 AM

New telugu movie updates - Sakshi

‘‘ఈ రోజుల్లో ఓ 3 నిమిషాలు తెలుగులో మాట్లాడాలంటేనే చాలా కష్టమవుతోంది. మరి ఈ చిత్రంలో కథానాయకుడు, నాయికల మధ్య తెలుగులో మాట్లాడాలనే ప్రేమపరీక్ష ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాటలో తెలుగులోని పద్యం, సామెత, ఛందస్సు, అలంకారాల గురించి రచయిత చాలా చక్కగా వివరించారు’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మహేంద్ర, లావణ్య, సమ్మెట గాంధీ, భవానీ శంకర్, సాకేత్‌ మాధవి, బేబి కీర్తన నటించిన చిత్రం ‘ఒక తెలుగు ప్రేమకథ’.

సంతోష్‌ కృష్ణ దర్శకత్వంలో కిషోరి బసిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో తెలుగుదనంపై వచ్చే పాటని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తెలుగు భాష అమరం.. అజరామరం.. ఇప్పుడున్న రోజుల్లో పూర్తి స్థాయి తెలుగులో మాట్లాడటమంటే చాలా కష్టం. అదే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందించడం అభినందనీయం’’ అన్నారు. ‘‘అందరూ తెలుగులోనే మాట్లాడాలి.. లేదంటే మన తెలుగు భాష మరుగున పడిపోతుంది’ అని దర్శకుడు చెప్పిన సందేశం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించా’’ అన్నారు కిషోరి బసిరెడ్డి. ‘‘ఉడుకు మనసు గల ఇద్దరి మధ్య గిల్లిగజ్జాలాటే ఈ సినిమా’’ అన్నారు సంతోష్‌ కృష్ణ. ఈ చిత్రానికి సంగీతం: మహత్‌ నారాయణ్, కెమెరా: దేవేందర్‌ రెడ్డి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement