ప్రేమ పోరాటం | New telugu movie updates | Sakshi
Sakshi News home page

ప్రేమ పోరాటం

Oct 10 2018 12:30 AM | Updated on Oct 10 2018 12:30 AM

New telugu movie updates - Sakshi

‘‘మోని’ టైటిల్‌ ఆసక్తిగా ఉంది. దర్శకుడు సత్యనారాయణ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తాను ఇదివరకు చేసిన ‘నందికొండ వాగుల్లోన’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ‘మోని’ కూడా సూపర్‌ హిట్‌ అవ్వాలి. నిర్మాతకు డబ్బులు రావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్‌ అన్నారు. లక్కీ ఏకారి, నాజియా జంటగా సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో రంజిత్‌ కోడిప్యాక సమర్పణలో తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రం ‘మోని’. నవనీత్‌ చారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను సాయి వెంకట్‌ విడుదల చేశారు. 

రంజిత్‌ కోడిప్యాక మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘షాలిని, నందికొండ వాగుల్లోన’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు లక్కీ ఏకారి. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉన్నాయి. మా బ్యానర్‌లో రెండో చిత్రంగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుంది’’ అన్నారు సత్యనారాయణ ఏకారి. ‘‘ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవడంతో పాటు మాకు, మా టీమ్‌కి మంచి క్రేజ్‌ తేవాలి’’ అని లక్కీ ఏకారి, నాజియా అన్నారు. సంగీత దర్శకుడు నవనీత్‌ చారి పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement