breaking news
Romantic comedy thriller
-
ప్రేమ పోరాటం
‘‘మోని’ టైటిల్ ఆసక్తిగా ఉంది. దర్శకుడు సత్యనారాయణ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తాను ఇదివరకు చేసిన ‘నందికొండ వాగుల్లోన’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలో ‘మోని’ కూడా సూపర్ హిట్ అవ్వాలి. నిర్మాతకు డబ్బులు రావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. లక్కీ ఏకారి, నాజియా జంటగా సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో రంజిత్ కోడిప్యాక సమర్పణలో తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రం ‘మోని’. నవనీత్ చారి స్వరపరచిన ఈ చిత్రం పాటలను సాయి వెంకట్ విడుదల చేశారు. రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘షాలిని, నందికొండ వాగుల్లోన’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు లక్కీ ఏకారి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉన్నాయి. మా బ్యానర్లో రెండో చిత్రంగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుంది’’ అన్నారు సత్యనారాయణ ఏకారి. ‘‘ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు మాకు, మా టీమ్‌కి మంచి క్రేజ్ తేవాలి’’ అని లక్కీ ఏకారి, నాజియా అన్నారు. సంగీత దర్శకుడు నవనీత్ చారి పాల్గొన్నారు. -
ఇప్పట్లో ఎవరుంటారు?
‘‘రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఓ హత్య మిస్టరీ ఉంటుంది’’ అని దర్శకుడు కె.వెంకటేష్ అన్నారు. ప్రశాంత్, మహిధర్, ఇషిత, లలిత ప్రధాన పాత్రల్లో బేబీ అముక్త సమర్పణలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశ్నాథ్ నిర్మించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ’. రమేష్.డి అందించిన ఈ చిత్రం పాటలను నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ - ‘‘ఈ చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు మా నియోజకవర్గానికి చెందినవారే. ఈ చిత్రం సూపర్ హిట్టయి వారిద్దరూ మంచి స్థాయికి ఎదగాలి’’ అన్నారు. ‘‘వెంకటేష్ నాకు పదేళ్లుగా తెలుసు. కథ వినగానే నిర్మించాలనుకున్నా’’ అని నిర్మాత తెలిపారు.