బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

New Task Decide A New Captain In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంటిసభ్యుల చేత కెప్టెన్సీ టాస్క్‌ ఆడించారు. అందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టగా వారి మధ్య ఐకమత్యం కనిపించలేదు. ఎవరికి వారే ఒంటరిగా టాస్క్‌లు గెలవడానికి పోరాడారు. టాస్క్‌లో గెలుపొందిన రాహుల్‌కు పునర్నవి గోరుముద్దలు తినిపించింది. ఎత్తుకు పై ఎత్తులతో సాగిన ఈ గేమ్‌లో శ్రీముఖి రాహుల్‌పై ఫైర్‌ అయింది. ‘నిన్ను నమ్మి టీంలోకి తీసుకున్నా. నన్ను మోసం చేస్తే నీతో జీవితంలో మాట్లాడను’ అని రాహుల్‌ పై సీరియస్‌ అయింది. అయితే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిలా రాహుల్‌.. శ్రీముఖికి పాద నమస్కారం చేసి మరీ తన దగ్గర ఉన్న గుడ్డును కొట్టేశాడు. దీంతో తెల్లముఖం వేయడం శ్రీముఖి వంతయింది. టాస్క్‌ ప్రారంభంలో అమ్మాయిలు హవా చూపించినప్పటికీ చివరికి ఆట అబ్బాయిల చేతిలోకి వెళ్లిపోయింది.

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ‘నేనే రాజు-నేనే మంత్రి’ గేమ్‌ ఆడించారు. ఇందుకుగానూ ఇంటి సభ్యులను విక్రమపురి (రెడ్‌ టీమ్‌), సింహపురి (బ్లూ టీమ్‌)లుగా విడగొట్టాడు. రెడ్‌ టీమ్‌కు సేనాపతిగా శ్రీముఖి, బ్లూ టీమ్‌ సేనాపతిగా హిమజలను నియమించారు. రెడ్‌ టీమ్‌ సేనాపతి శ్రీముఖి.. అలీ, రాహుల్‌, మహేశ్‌, అషూరెడ్డిలను సైనికులుగా ఎంచుకుంది. బ్లూ టీమ్‌ సేనాపతి హిమజ.. వరుణ్‌, పునర్నవి, బాబా భాస్కర్‌, రవిలను సైనికులుగా సెలక్ట్‌ చేసుకుంటుంది. ఆట విషయానికొస్తే.. రెడ్‌ టీం దగ్గర ఎరుపు రంగు జెండాలు, బ్లూ టీం దగ్గర నీలం రంగు జెండాలు ఉంటాయి. రెడ్‌ టీం.. బ్లూ టీం రాజ్యంలో జెండాలు పాతాలి. అదే విధంగా బ్లూ టీం.. రెడ్‌ టీం రాజ్యంలో జెండాలను ఉంచాలి. పొరుగు రాజ్యం పాతిన జెండాలను నిర్దాక్షిణ్యంగా తీసి పాడేసే హక్కు సంబంధిత రాజ్యానికి ఉంటుంది.

బజర్‌ మోగగానే హోరాహోరీగా సాగిన ఈ ఆట రాను రానూ రసవత్తరంగా మారింది. మొదట జెండాల కోసం కుస్తీ పడ్డా తరువాత అందరి దృష్టి డ్రాగన్‌ ఎగ్స్‌పైకే వెళ్లింది. గుడ్డు సంపాదించుకున్న వారికి ప్రత్యేక ప్రయోజనాలతో పాటు నేరుగా రెండో రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉండటమే ప్రధాన కారణం. ఇరు రాజ్యాల సైనికులు ఎంతసేపూ గుడ్డు మీద కన్నేయడంతో రెండు టీమ్‌లు తదుపరి లెవల్‌కు వెళ్లలేదు. ఆట ప్రారంభానికి ముందే డ్రాగన్‌ ఎగ్స్‌ సంపాదించుకున్న వితిక, రోహిణి, శివజ్యోతిలు వాటిని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ గుడ్లను జారవిడ్చుకుని కెప్టెన్సీ టాస్క్‌ మధ్యలోనే తప్పుకున్నారు. ఇక రెడ్‌ టీం.. జెండాలు కాపాడుకున్నా, సైనికులు లేక.. బ్లూ టీమ్‌ అటు జెండాలు, ఇటు సైనికులు రెండూ కోల్పోవడంతో తర్వాతి లెవల్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయాయి.

వ్యూహాత్మకంగా సాగిన ఈ గేమ్‌లో చివరాఖరికి రాహుల్‌, రవి, అలీ రెజాలు డ్రాగన్‌ ఎగ్స్‌ దక్కించుకుని నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లారు. కెప్టెన్సీ టాస్క్‌లో ఈ ముగ్గురూ తలపడనున్నారు. కూల్‌గా ఉండే రవి, అతిగా ఆవేశపడే అలీ, నవ్వుతూనే ఎత్తులు వేసే రాహుల్‌.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్‌గా నిలుస్తారో చూడాలి..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వార్తలు

12-11-2019
Nov 12, 2019, 19:01 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 టైటిల్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లీగంజ్‌ పాడాల్సిన రాములో రాములా..పాట అనురాగ్‌ కులకర్ణికి దక్కింది.
11-11-2019
Nov 11, 2019, 11:14 IST
హేమ, హిమజ చేసిన నెగెటివ్‌ కామెంట్లను పట్టించుకోకండి..
10-11-2019
Nov 10, 2019, 10:52 IST
ఆమె రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నా.. తను వెళ్లాలనుకున్న చోటుకు వెళ్లి కోరిక నెరవేర్చుకుంది. 
09-11-2019
Nov 09, 2019, 20:07 IST
సాక్షి, సిటీబ్యూరో : అశేష ప్రేక్షకాదరణ పొందిన బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 విన్నర్‌గా నిలిచిన గాయకుడు రాహుల్‌...
08-11-2019
Nov 08, 2019, 10:47 IST
జాఫర్‌ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జాఫర్‌ ప్రవర్తిస్తున్నాడని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
07-11-2019
Nov 07, 2019, 08:42 IST
రాహుల్‌ సిప్లిగంజ్‌.. మొన్నటి దాకా సినీ నేపథ్య గాయకుడు. మరి నేడు.. బిగ్‌బాస్‌–3 విజేత.అత్యంత సాధారణ యువకుడిగా ఎలాంటి అంచనాలు...
06-11-2019
Nov 06, 2019, 16:59 IST
రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఇప్పుడు ఈ పేరు ప్రతీగల్లీలో మారుమోగుతోంది. బిగ్‌బాస్‌ తెలుగు 3 విజేతగా తన పేరు లిఖించుకున్న రాహుల్‌ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా...
06-11-2019
Nov 06, 2019, 15:42 IST
బాబా భాస్కర్‌.. తెలిసిన కొద్దిమందికీ కోపిష్టి కొరియోగ్రాఫర్‌గా పరిచయం. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ కా కింగ్‌. ఆయన మాటలకు నవ్వుకోని...
06-11-2019
Nov 06, 2019, 15:06 IST
బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ మొత్తమే దక్కిందని తెలుస్తోంది.
06-11-2019
Nov 06, 2019, 11:15 IST
ప్రముఖ యాంకర్‌ ఝాన్సీ సోషల్‌ మీడియా వేదికగా బిగ్‌బాస్‌ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
05-11-2019
Nov 05, 2019, 17:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌-పునర్నవిల రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్‌లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ...
05-11-2019
Nov 05, 2019, 14:42 IST
అతిరథ మహారథుల సమక్షంలో బిగ్‌బాస్‌ 3 తెలుగు షో విజేతను ప్రకటించారు. 105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌...
05-11-2019
Nov 05, 2019, 12:09 IST
శ్రీముఖి వేసుకున్న పచ్చబొట్టే  ఆమె ఓటమికి నాంది పలికిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
05-11-2019
Nov 05, 2019, 10:25 IST
‘విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది’ అని ఆమె బిగ్‌బాస్‌ వేదికపై చెప్పుకొచ్చింది. అంటే రాహుల్ ఏం చేయకపోయినా కేవలం అదృష్టం వల్లే గెలిచాడు...
04-11-2019
Nov 04, 2019, 20:28 IST
ఆద‍్యంతం ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి నిన్నటి (ఆదివారం)తో శుభంకార్డు పడింది. 105 రోజుల ప్రయాణానికి తెరదించుతూ...
04-11-2019
Nov 04, 2019, 12:44 IST
ఏ ప్రాతిపదికన రాహుల్‌ సిప్లిగంజ్‌ను విజేతగా ప్రకటించారో చెప్పాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
04-11-2019
Nov 04, 2019, 10:38 IST
పున్నూ ఫ్యాన్స్‌ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్‌ చేసిన ప్రతీసారి అతని బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
04-11-2019
Nov 04, 2019, 08:54 IST
మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్‌ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా...
04-11-2019
Nov 04, 2019, 08:11 IST
‘నాకిక్కడ రక్షణ లేదు.. పోలీసులు లంచాలు పుచ్చుకుని నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తాను వేరే రాష్ట్రానికి వెళ్లిపోతాను.
03-11-2019
Nov 03, 2019, 22:33 IST
సాక్షి, హైదరాబాద్‌ : 3 నెలల క్రితం ప్రారంభమై వివాదాలు, సంవాదాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్‌–3 షో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top