ప్రేమలో థ్రిల్‌ | Nenu Lenu movie teaser launch | Sakshi
Sakshi News home page

ప్రేమలో థ్రిల్‌

Nov 13 2018 2:42 AM | Updated on Nov 13 2018 2:42 AM

Nenu Lenu movie teaser launch - Sakshi

హర్షిత్‌ హీరోగా రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్‌ ఇన్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్‌.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్‌ పతాకంపై సుక్రి కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ టీజర్‌ విడుదల చేశారు. రామ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

ప్రస్తుతం డీటీఎస్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. కథనం, సంగీతం, కెమెరావర్క్‌ మా సినిమాకు ప్రత్యేక ఎసెట్‌గా నిలుస్తాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహ నిర్మాత: యాషిక.

Advertisement
 
Advertisement
Advertisement