ఈ సినిమాతో హిట్‌ గ్యారంటీ | Nenorakam Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఈ సినిమాతో హిట్‌ గ్యారంటీ

Mar 8 2017 11:49 PM | Updated on Mar 22 2019 1:53 PM

ఈ సినిమాతో హిట్‌ గ్యారంటీ - Sakshi

ఈ సినిమాతో హిట్‌ గ్యారంటీ

నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్‌ శంకర్‌కు హిట్‌ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది.

– పూరి జగన్నాథ్‌
‘‘నేనో రకం’ సినిమా చూశా. కథ, కథనాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంతో రామ్‌ శంకర్‌కు హిట్‌ గ్యారంటీ అనే నమ్మకం వచ్చింది. మహిత్‌ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. రామ్‌ శంకర్, రేష్మిమీనన్‌ జంటగా శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్‌  సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌ రెడ్డి ఈ  చిత్రం నిర్మించారు. మహిత్‌ నారాయణ్‌ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను పూరి జగన్నా«థ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,  హీరో గోపీచంద్‌ విడుదల చేసి, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కథ నచ్చడంతోనే శరత్‌ కుమార్‌ ఈ సినిమా చేశారు. మహిత్‌ పాటలు, రీ–రికార్డింగ్‌ హైలెట్‌. ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్‌ను ‘నేనో రకం’ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘రామ్‌ శంకర్‌ కెరీర్‌లో ‘నేనో రకం’ది బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది. మార్చి 17న సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. రామ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సమకాలీన అంశాల స్ఫూర్తితో పక్కా కమర్షియల్‌ అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement