అద్భుతమైన ప్రేమకథ | Nee Jathaga Nenundali Audio Released | Sakshi
Sakshi News home page

అద్భుతమైన ప్రేమకథ

Jun 16 2014 12:39 AM | Updated on Sep 2 2017 8:51 AM

అద్భుతమైన ప్రేమకథ

అద్భుతమైన ప్రేమకథ

బాలీవుడ్ హిట్ ‘ఆషికి 2’ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘నీ జతగా నేనుండాలి’. సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. కె.జయరవీంద్ర దర్శకుడు. బండ్ల గణేశ్

 బాలీవుడ్ హిట్ ‘ఆషికి 2’ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘నీ జతగా నేనుండాలి’. సచిన్, నజియా జంటగా నటిస్తున్నారు. కె.జయరవీంద్ర దర్శకుడు. బండ్ల గణేశ్ నిర్మాత. జీత్ గంగూలి, అంకిత్ తివారి, మిథున్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిల్ రాజు ఆడియో సీడీని ఆవిష్కరించగా, శిరీష్, లక్ష్మణ్ ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బీవీఎస్ రవి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షను వెలిబుచ్చారు.
 
 ఈ కథ మీదున్న ప్రేమతో సచిన్ ఈ సినిమా చేస్తున్నారని, బండ్ల గణేశ్ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని దర్శకుడు చెప్పారు. ‘‘ ‘ఆషికి 2’ రైట్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్ అని ఆలోచిస్తున్న సమయంలో టక్కున సచిన్ గుర్తొచ్చారు. తెలుగులో తను నటించి చాలా కాలమైంది. పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు తను. హిందీలో విజయం సాధించినట్లే, తెలుగులో కూడా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంటుంది. జూలై మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం’’ అని బండ్ల గణేశ్ తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఖర్చుకు వెనుకాడకుండా గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇది అద్భుతమైన ప్రేమకథ అని సచిన్ చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement