ప్రేమికుల రోజున నయనతార, ఉదయనిధి స్టాలిన్ చిత్రం | nayanthara, udhayanidhi stalin movie will start lovers day | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజున నయనతార, ఉదయనిధి స్టాలిన్ చిత్రం

Jan 18 2014 1:42 AM | Updated on Sep 2 2017 2:43 AM

ప్రేమికుల రోజున నయనతార, ఉదయనిధి స్టాలిన్ చిత్రం

ప్రేమికుల రోజున నయనతార, ఉదయనిధి స్టాలిన్ చిత్రం

ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఈ చిత్రం ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఈ చిత్రం ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఉదయనిధి స్టాలిన్, నయనతార తొలిసారిగా జత కట్టిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ జెయిన్ మూవీస్ నిర్మిస్తోంది. హారిష్ జయరాజ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 20న విడుదలకానుంది.
 
 ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి ఘన విజయం సాధించింది. దీంతో ఆయన రెండవ చిత్రమైన ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే విధంగా దర్శకుడు ప్రభాకరన్ తొలి చిత్రం సుందర పాండియన్ విజయం సాధించింది. ఇది ఆయనకు రెండవ చిత్రం కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement