breaking news
IDHU KATHIRVELAN KADHAL
-
నయన క్రేజ్ తగ్గలేదు
నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిజం చెప్పాలంటే మరింత పెరిగిందని అంటున్నారు యువ దర్శకుడు ఎస్ ఆర్ ప్రభాకరన్. సుందర పాండియన్ చిత్రం ద్వారా మెగా ఫోన్ పట్టిన ఈయన తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. ఇది ఈ నెల 14న విడుదల కానుంది. దర్శకుడితో మినీ ఇంటర్వ్యూ. ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్ర అవకాశం గురించి? నా తొలి చిత్రం సుందర పాండియన్ సక్సెస్‌తో చాలా సంస్థలు చిత్రం చేయమని అడిగారుు. అదే విధంగా రెడ్ జెయింట్ సంస్థ నుంచి పిలుపొచ్చింది. మా సంస్థకు ఒక చిత్రం చేయమని ఉదయనిధి స్టాలిన్ అడిగారు. సరేనని రెండు లైన్ల కథ చెప్పాను. బాగుంది. కథను డెవలప్ చేయండి నేనే హీరోగా నటిస్తాను అన్నారు. దీంతో ఆయన్ని మైండ్‌లో ఉంచుకుని కథను సిద్ధం చేశాను. ఉదయనిధి స్టాలిన్ సూపర్‌గా ఉందన్నారు . అలా మొదలైన చిత్రమే ఇదు కదిర్ వేలన్ కాదల్. ఇది కదిరవేలన్ అనే యువకుడి లవ్ స్టోరీయూ? అవును. సుందర పాండియన్ చిత్రంలో స్నేహం గురించి చెప్పాను. ఈ చిత్రంలో ప్రేమ గురించి చెప్పాను. ప్రేమ అనేది ఒక యువకుడు తాను మనసుపడ్డ యువతిపై చూపించడం మాత్రమే కాదు. తల్లిదండ్రులు, సోదరులు, బాబాయి, పిన్ని, మామ, అత్తలపైన చూపేది కూడా ప్రేమే. ఇది ఈ చిత్రంలో చెప్పాను. హీరో తన కుటుంబంపై చూపే ప్రేమే చిత్రం. ఇది మదురై నేపథ్యంలో జరిగే కథేనా? అలాంటిదే అయి నా మదురై యాస మాత్రం ఉండదు. అక్కడి కుర్రాడి కుటుంబ బంధాలు తద్వారా ఏర్పడే ప్రేమ, చిక్కులు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు వంటి అంశాల సమాహారమే ఇదు కదిర్ వేలన్ కాదల్. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఉన్నవారే ఇందులోనూ ఉన్నారు? ఆ చిత్రం ఛాయలు ఈ చిత్రంపై పడుతాయనే కదా! మీ సందేహం. ఒక్క షాట్ కూడా ఆ చిత్రాన్ని గుర్తుకు తీసుకురాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కథతో కలిసి కామెడీ ఉండటంతో ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు మీకు ఇది రెండవ చిత్రం. ఎలా ఫీలవుతున్నారు? ఫీలింగ్ అంటే ప్రతి చిత్రం ఒక అనుభవమే. తొలి చిత్రంలోని చిన్న చిన్న లోపాలను తదుపరి చిత్రంలో సరిదిద్దుకోవాలని నా లాంటి యువ కళాకారులు భావిస్తారు. అలాగే ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ పాటల్లో యదార్థంగా ఆడినా చిన్న చిన్న విమర్శలు వచ్చాయి. వాటిని అధిగమించడానికి ఈ చిత్రంలో ప్రత్యేక దృష్టి సారించి రిహార్షిల్స్ చేసి మరీ నటించారు. ఆ మార్పు ఈ చిత్రంలో పక్కాగా కనిపిస్తోంది. నా సైడ్‌లో కూడా ఆ ప్రయత్నం కనిపిస్తుంది. నయనతార - ఉదయనిధి స్టాలిన్ల జోడి గురించి? నయనతార చాలా సీనియర్ నటి. రీ ఎంట్రీ అయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఉదయనిధి స్టాలిన్, నయనతారలతో ఫొటో షూట్ చేస్తున్నప్పుడు ఆమె మెచ్యూర్‌గా అనిపిస్తుందేమోనన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే వీరి కాంబినేషన్ తొలి స్టిల్ బయటకు రాగానే జంట సూపర్‌గా ఉందని అన్నారు. విజువల్‌లో వారు చూడముచ్చటగా ఉంటారు. ప్రేమికులంటే ఇలా ఉండాలని చిత్రం చూసిన తరువాత అందరూ అంటారు. సాధారణంగా పది చిత్రాలు విడుదలైతే వాటిలో రెండు మూడు చిత్రాలలోనే హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుంది. అలా ఈ చిత్రంలో పవిత్ర అనే ప్రాముఖ్యత వున్న పాత్రలో నయనతార నటించారు. చిత్ర కథే ఆమె చుట్టూ తిరుగుతుంది. -
ప్రేమికుల రోజున నయనతార, ఉదయనిధి స్టాలిన్ చిత్రం
ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ఈ చిత్రం ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఉదయనిధి స్టాలిన్, నయనతార తొలిసారిగా జత కట్టిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ జెయిన్ మూవీస్ నిర్మిస్తోంది. హారిష్ జయరాజ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 20న విడుదలకానుంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి ఘన విజయం సాధించింది. దీంతో ఆయన రెండవ చిత్రమైన ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే విధంగా దర్శకుడు ప్రభాకరన్ తొలి చిత్రం సుందర పాండియన్ విజయం సాధించింది. ఇది ఆయనకు రెండవ చిత్రం కావడం విశేషం. -
ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ
ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆయన నటించిన ప్రతి సన్నివేశంలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. సాధారణంగా వర్ధమాన నటుల్లో నటిస్తున్నప్పుడు చిన్న భయం, ఆందోళనలాంటివి కలుగుతాయి. అయితే నేనాశ్చర్యపడిన విషయం ఈ యువ నటుడిలో అలాంటివేవీ కనపడలేదు. అలాంటి నటుడితో కలసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటూ పోతున్నారు నటి నయనతార. ఇంతకీ ఈ క్రేజీ హీరోయిన్ అంతగా ప్రశంసల జల్లు కురిపిస్తున్న ఆ నటుడు ఎవరనుకుంటున్నారా! ఇంకెవరు నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదు కదిర్వేలన్ కాదల్. సుందర పాండియన్ చిత్రం ఫేమ్ ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తన పోర్షన్ పూర్తి అయిన సందర్భంగా నయనతార ఈ చిత్రంలో నటించిన తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. దర్శకుడు ప్రభాకరన్ గత చిత్రం చూశానని తొలి చిత్రంతోనే ప్రతిభావంతుడైన దర్శకుడని నిరూపించుకున్నారని తెలిపారు. ఇక ఇదు కదిరవేలన్ కాదల్ విషయానికొస్తే ఇది మనసులను హత్తుకునే చక్కని కుటుంబ కథా చిత్రం అని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం తీయని అనుభూతి అని చెప్పారు. ఈ చిత్ర యూనిట్‌తో పని చేయడం చాలా సౌలభ్యంగా ఫీలయ్యానన్నారు. షూటింగ్లో జరిగిన చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని నయనతార అన్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న అనామిక చిత్రంలో నటిస్తున్న ఈ సంచలన నటి తదుపరి పాండియరాజ్ దర్శకత్వంలో శింబుకు జంటగా, జయంరాజా దర్శకత్వంలో జయంరవి సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు.