ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ | udhaya nidhi stalin having more confidence : nayanatara | Sakshi
Sakshi News home page

ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ

Nov 30 2013 2:12 AM | Updated on Sep 2 2017 1:06 AM

ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆయన నటించిన ప్రతి సన్నివేశంలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. సాధారణంగా వర్ధమాన నటుల్లో నటిస్తున్నప్పుడు చిన్న భయం,

ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆయన నటించిన ప్రతి సన్నివేశంలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. సాధారణంగా వర్ధమాన నటుల్లో నటిస్తున్నప్పుడు చిన్న భయం, ఆందోళనలాంటివి కలుగుతాయి. అయితే నేనాశ్చర్యపడిన విషయం ఈ యువ నటుడిలో అలాంటివేవీ కనపడలేదు. అలాంటి నటుడితో కలసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటూ పోతున్నారు నటి నయనతార. 
 
 ఇంతకీ ఈ క్రేజీ హీరోయిన్ అంతగా ప్రశంసల జల్లు కురిపిస్తున్న ఆ నటుడు ఎవరనుకుంటున్నారా! ఇంకెవరు నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదు కదిర్‌వేలన్ కాదల్. సుందర పాండియన్ చిత్రం ఫేమ్ ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తన పోర్షన్ పూర్తి అయిన సందర్భంగా నయనతార ఈ చిత్రంలో నటించిన తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. దర్శకుడు ప్రభాకరన్ గత చిత్రం చూశానని తొలి చిత్రంతోనే ప్రతిభావంతుడైన దర్శకుడని నిరూపించుకున్నారని తెలిపారు.
 
 ఇక ఇదు కదిరవేలన్ కాదల్ విషయానికొస్తే ఇది మనసులను హత్తుకునే చక్కని కుటుంబ కథా చిత్రం అని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం తీయని అనుభూతి అని చెప్పారు. ఈ చిత్ర యూనిట్‌తో పని చేయడం చాలా సౌలభ్యంగా ఫీలయ్యానన్నారు. షూటింగ్‌లో జరిగిన చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని నయనతార అన్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న అనామిక చిత్రంలో నటిస్తున్న ఈ సంచలన నటి తదుపరి పాండియరాజ్ దర్శకత్వంలో శింబుకు జంటగా, జయంరాజా దర్శకత్వంలో జయంరవి సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement