వెళ్లండి.. మళ్లీ రాకండి

Nayanthara Turns Doctor For Ajith - Sakshi

ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు, ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఇంటికి వెళ్లి, అక్కణ్ణుంచి వచ్చేటప్పుడు ‘వెళ్లొస్తాం’ అంటాం. కానీ హాస్పిటల్‌కి వెళితే మాత్రం వెళ్తాం అని మాత్రమే డాక్టర్స్‌కు చెబుతాం. ఎందుకంటే.. మళ్లీ అనారోగ్యంతో హాస్పిటల్‌కి రాకూడదని, లైఫ్‌లో ఆరోగ్యంగా ఉండాలనే  ఉద్దేశంతో. ప్రజెంట్‌ నటి నయనతారకు కూడా వెళ్తాం అని చెప్పగానే ‘వెళ్లండి.. మళ్లీ రాకండి’ అంటున్నారట. అర్థం కాలేదా? ఆమె డాక్టర్‌ అని చెప్తున్నాం.

అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వాసం’లో నయనతార నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల  ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ ముంబైలో స్టార్ట్‌ అయ్యిందని సమచారం. ఇందులో నయనతార డాక్టర్‌గా నటిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో అజిత్‌ డబుల్‌ రోల్‌ చేస్తున్నారన్న వార్త షికారు చేస్తోంది. వివేక్, యోగిబాబు, కోవై సరళ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారమ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top