ప్రియుడి పుట్టిన రోజు వేడుకల్లో నయనతార

Nayanthara Grandly Celebrates Boyfriend Vignesh Shivan Birthday - Sakshi

లక్ష్మీ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నయనతార ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో నటించిన సైరా నర్సింహరెడ్డి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే రీల్‌ లైఫ్‌లో ఇంతా బీజిగా ఉన్నా నయన.. రియల్‌ లైఫ్‌లోను ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌తో ఎంజాయ్‌ చేస్తోంది. రచయిత, దర్శకుడితో కెరీర్‌ ప్రారంభించి నిర్మాతగా మారిన విఘ్నేష్‌ శివన్‌తో లవ్‌ట్రాక్‌ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2015 లో వచ్చిన ‘నానుమ్ రౌడీ ధన్’ చిత్రంలో వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు.

కాగా సెప్టెంబర్‌ 18 గురువారం రోజు విఘ్నేష్‌ 34వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా నయన ప్రియుడికి ఓ భారీ కానుకను అందించారు. పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌ 17న విఘ్నేష్‌ కోసం నగరంలోని ఓ కేఫ్‌లో గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించిన ఓ వీడియోను నయన బుధవారం తన ట్విటర్‌లో పంచుకున్నారు. దీనికి ‘ప్రత్యేక రోజు.. ప్రత్యేక వేడుకలు’ అనే క్యాప్షన్‌ తో అభిమానులకు షేర్‌ చేశారు.

ఈ పార్టీలో తన స్నేహితులైన స్వరకర్త అనిరుధ్ రవిచందర్, ధరణ్ కుమార్, యాంకర్‌ దివ్యధర్షిని,  ప్రకృతి కృత్ అనంత్,  సమ్యూత, ఆర్తి వెంకటేష్, పూర్తి ప్రవీణ్ పార్టీలో పాల్గొన్నారు. నయనతార, విఘ్నేష్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విఘ్నేష్‌ నయనతార నటిస్తున్న నేత్రికాన్‌ సినిమా పనులతో బీజిగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top