నవ్వులే నవ్వులు! | Naveen Chandra's Upcoming Movie Finalized | Sakshi
Sakshi News home page

నవ్వులే నవ్వులు!

Jul 15 2016 11:10 PM | Updated on Sep 4 2017 4:56 AM

నవ్వులే నవ్వులు!

నవ్వులే నవ్వులు!

‘అధినేత’,‘ ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ తాజాగా నవీన్‌చంద్ర హీరోగా ఓ చిత్రం...

‘అధినేత’,‘ ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’ తదితర చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ తాజాగా నవీన్‌చంద్ర హీరోగా ఓ చిత్రం నిర్మించనున్నారు. ‘ఓ చినదాన’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఇ.సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వంద శాతం నవ్వులు పంచుతుంది. సత్తిబాబు ఈ కథను బాగా హ్యాండిల్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 
నితిన్ హీరోగా భారీ చిత్రం
ఇదే బ్యానర్‌లో నితిన్ హీరోగా రాధాకృష్ణ  నిర్మించనున్న భారీ చిత్రం డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement