నవీన్ చంద్ర, వరలక్ష్మీ శరత్‌కుమార్ జంటగా నటించిన పోలీస్ కంప్లెయింట్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 22న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు.
సంజీవ్ మేగోటి మాట్లాడుతూ–‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాం. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ కథకి హారర్, థ్రిల్లర్ అంశాలను జోడించాం’’ అని తెలి పారు.


