బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌ | Navadeep Gift To Allu Arjun | Sakshi
Sakshi News home page

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌

Jun 23 2019 2:28 PM | Updated on Jun 23 2019 2:38 PM

Navadeep Gift To Allu Arjun - Sakshi

తన బావ ఓ మంచి బహుమతిని ఇచ్చాడని స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. ఇంతకీ ఆ గిఫ్ట్‌ ఏంటి? ఆ బావ ఎవరు? అనే కదా సందేహం. రుద్రమదేవి చిత్రంలో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ పాత్ర అయిన గోన గన్నారెడ్డి పాత్రకు సంబంధించిన ఓ బొమ్మను హీరో నవదీప్‌ బన్నీ ప్రజెంట్‌ చేశాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు.

గోన గన్నారెడ్డిగా బన్నీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బన్నీ చేసిన ఈ క్యారెక్టర్‌.. సినిమా విజయవంతం కావడంలో ముఖ్యపాత్రను పోషించింది. తాజాగా ఆ గెటప్‌ ఉన్న బొమ్మను నవదీప్‌.. బన్నీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఆర్య-2లో అల్లరి చేసిన వీరిద్దరూ .. తెర వెనకాల కూడా మంచి స్నేహితులుగా మారారు. తాజాగా నవదీప్‌ తనకు ఇచ్చిన బహుమతి గురించి సోషల్‌ మీడియాలో తెలుపుతూ.. ‘ఔ గన్నారెడ్డి.. గోన గన్నారెడ్డి.. వన్‌ ఆఫ్‌ ది స్వీటెస్ట్‌ గిఫ్ట్‌.. థాంక్యూ నవదీప్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement