గ్రామీణ నేపథ్యంలో... | Sakshi
Sakshi News home page

గ్రామీణ నేపథ్యంలో...

Published Sun, Sep 23 2018 2:03 AM

Natakam to release on September 28 - Sakshi

ఆశిష్‌ గాంధీ. ఆశిమా నెర్వల్‌ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిధీప్‌ చాట్ల, రాధికా శ్రీనివాస్, ప్రవీణ్‌ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మించారు. కళ్యాణ్‌ జీ గోగన దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెల 28న ‘నాటకం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ ఫేమ్‌ అంజి, సంగీతం: సాయికార్తీక్‌.

Advertisement
Advertisement