ఫుల్‌ యాక్షన్‌ | Nara Rohith's New Film Launched | Sakshi
Sakshi News home page

ఫుల్‌ యాక్షన్‌

Mar 5 2017 11:29 PM | Updated on Aug 29 2018 3:53 PM

ఫుల్‌ యాక్షన్‌ - Sakshi

ఫుల్‌ యాక్షన్‌

రజనీకాంత్‌ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో తెలిసిందే.

రజనీకాంత్‌ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఆ తరహా పాత్రలో కనిపించనున్నారట. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్‌ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఎస్‌.వి.ఎం.పి. పతాకంపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్‌ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేయస్‌ రామారావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. మరో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ దర్శకునికి స్క్రిప్ట్‌ అందించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సీనియర్‌ నటి రమ్యకృష్ణ మా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ‘నరసింహ‘ చిత్రంలోని నీలాంబరి రేంజ్‌ క్యారెక్టర్‌ ఆమెది’’ అన్నారు. అజయ్, పృధ్వీ, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, సత్యకృష్ణ, తేజస్విని, శ్రావ్యా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: యోగానంద్, కెమెరా: విజయ్‌ సి.కుమార్, సంగీతం: మణిశర్మ.

Advertisement
 
Advertisement
Advertisement