ఎన్టీఆర్తో ఢీ అంటోన్న నారావారబ్బాయి..? | Nara Rohit as Antagonist in NTR, trivikram film | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్తో ఢీ అంటోన్న నారావారబ్బాయి..?

Jun 16 2017 11:28 AM | Updated on Aug 29 2018 3:53 PM

ఎన్టీఆర్తో ఢీ అంటోన్న నారావారబ్బాయి..? - Sakshi

ఎన్టీఆర్తో ఢీ అంటోన్న నారావారబ్బాయి..?

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తరువాత మాటల

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్రివిక్రమ్తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జూనియర్, ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్, కథా కథనాలు సిద్ధం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అక్టోబర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నారా రోహిత్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధకృష్ణ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జై లవ కుశ షూటింగ్ తరువాత బిగ్ బాస్ తెలుగు షో షూటింగ్ కోసం కొంత కాలం ముంబైలోనే ఉండనున్నాడు జూనియర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement