నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల | nannaku prematho teaser storms social media | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల

Oct 21 2015 6:23 PM | Updated on Jul 14 2019 3:48 PM

నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల - Sakshi

నాన్నకు ప్రేమతో.. టీజర్ విడుదల

సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమా టీజర్ విడుదలైంది.

సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త లుక్‌తో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో..' సినిమా టీజర్ విడుదలైంది. ముందునుంచి అన్నట్లుగానే దసరా కానుకగా బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేశారు. 'ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు' అనే పాటతో కూడిన ఈ టీజర్‌ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. తారక్ నటిస్తున్న 25వ సినిమా కావడం, విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దీనికి దర్శకత్వం వహిస్తుండటంతో దీనిపై అంచనాలు బాగా పెరిగాయి. దేవిశ్రీ ప్రసాద్ మార్కు సంగీతం ఈ టీజర్‌లో కనిపిస్తోంది.

టెంపర్ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న జూనియర్ ఈ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. 'వన్' ఫెయిల్యూర్ తరువాత డైరెక్టర్ సుకుమార్ చేస్తున్న సినిమా కావటం కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. హీరోల లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే సుకుమార్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ను సరికొత్తగా చూపిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు నెగెటివ్ రోల్లో అలరించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement