నాన్నకు ప్రేమతో ఆడియో డేట్..? | Nannaku prematho audio release date | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో ఆడియో డేట్..?

Dec 20 2015 12:04 PM | Updated on Jul 12 2019 4:40 PM

నాన్నకు ప్రేమతో ఆడియో డేట్..? - Sakshi

నాన్నకు ప్రేమతో ఆడియో డేట్..?

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని...

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ఆడియో రిలీజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. దీంతో ఆడియోను ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయంపై కూడా సందిగ్థంలో ఉన్నారు.

సంక్రాంతికే రిలీజ్ అవుతున్న మరో సినిమా.. డిక్టేటర్ ఆడియోను ఈ రోజు (ఆదివారం) రిలీజ్ చేస్తుండగా, వీలైనంత త్వరగా తమ ఆడియోను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు నాన్నకు ప్రేమతో టీం. అందుకే డిసెంబర్ 27న ఈ సినిమా ఆడియోను గ్రాండ్గా లాంచ్ చేయాలని, ఆ రోజే సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అనుకున్నట్టుగా బాబాయ్తో పోటీకి దిగుతాడో లేడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement