ముదురుతున్న ‘గ్యాంగ్‌ లీడర్‌’ వివాదం

Nani Vikram Kumar Gang Leader Title Controversy - Sakshi

నాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌తో టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, గ్యాంగ్ లీడర్ పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం. అక్టోబర్‌లో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు ప్లాన్  చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని.

గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్ తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్‌ను ఎలా ఎనౌన్స్ చేస్తారు.

నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్ కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం.

టైటిల్ విషయంలో లీగల్ గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక... 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం. అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top