అమ్మాయిలకు ప్రత్యేకం | nani, vikram k kumar new movie plans | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు ప్రత్యేకం

Dec 3 2018 4:32 AM | Updated on Dec 3 2018 4:32 AM

nani, vikram k kumar new movie plans - Sakshi

నాని, విక్రమ్‌ కుమార్‌

హీరో నాని, దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ సినిమాలో ఇంకా ముఖ్యమైన ఐదుగురు ఉంటారు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరు? అంటే వచ్చే ఏడాది చెబుతాం అంటున్నారు చిత్రబృందం. ‘ఇష్క్, మనం, 24’ చిత్రాల ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ విషయంపై ఆదివారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘నేను, విక్రమ్‌.. ఇంకా ఆ మిగతా ఐదుగురు.

వచ్చే సంవత్సరంలో..! అమ్మాయిలూ... ఇది మీ కోసమే’ అని నాని పేర్కొన్నారు. ‘నాని, నేను ఓ విభిన్నమైన కథాంశంతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ చిత్రం అమ్మాయిలకు ప్రత్యేకమైనదిగా ఉంటుంది’ అన్నారు దర్శకుడు విక్రమ్‌. ‘నాని హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో మా సంస్థలో సినిమా నిర్మించనుండటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పీసీ శ్రీరామ్‌గారు ఛాయాగ్రాహకులుగా పనిచేస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఫిబ్రవరి 19 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘నా డ్రీమ్‌ టీమ్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు పీసీ శ్రీరామ్‌.

Advertisement
 
Advertisement
Advertisement