మహాలక్ష్మి బిజీ అవుతోంది | nani heroine busy with kalyan ram, Sai dharam tej films | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మి బిజీ అవుతోంది

Feb 19 2016 5:13 PM | Updated on Sep 3 2017 5:58 PM

మహాలక్ష్మి బిజీ అవుతోంది

మహాలక్ష్మి బిజీ అవుతోంది

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మహాలక్ష్మీగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మెహ్రీన్. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ...

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మహాలక్ష్మిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మెహ్రీన్. తొలి సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. సినిమా రిలీజ్కు ముందునుంచే తన లుక్తో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సినిమా రిలీజ్ తరువాత మంచి నటిగా కూడా మార్కులు కొట్టేసింది. దీంతో యంగ్ హీరోలు మెహ్రీన్తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మెహ్రీన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా రిలీజ్ సమయంలో మెహ్రీన్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన పూరీ జగన్నాథ్, తన దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం మెహ్రీన్ను ఎంపిక చేసుకున్నాడు. తాజాగా మరో క్రేజ్ ఆఫర్ను కూడా కొట్టేసింది ఈ బ్యూటీ.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు మెహ్రీన్ను హీరోయిన్గా తీసుకునే ఆలోచన చేస్తున్నారు చిత్రయూనిట్. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత బీవీయస్ రవి దర్శకుడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ  ప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement