‘ఎన్టీఆర్‌’లో హరికృష్ణ లుక్‌ ఇదే | Nandamuri Kalyan Ram Look In NTR Katha Nayakudu | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌’లో హరికృష్ణ లుక్‌ ఇదే

Oct 18 2018 5:00 PM | Updated on Oct 18 2018 5:02 PM

Nandamuri Kalyan Ram Look In NTR Katha Nayakudu - Sakshi

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన కుమారుడు హరికృష్ణగా కళ్యాణ్‌రామ్‌ ఉన్న ఫొటోను దసరా సందర్భంగా బయటకు వదిలారు. బాలకృష్ణ ఠీవిగా కూర్చుని వుండగా కళ్యాణ్‌రామ్‌ ఆయన పక్కన వంగి ఉన్నట్టుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో అభిమానులకు కనువిందు చేస్తోంది. ‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ డైలాగ్‌ కూడా పెట్టారు.

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా(కథానాయకుడు, మహానాయకుడు)గా రానుంది. విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా ఇతర  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement