మరో సీనియర్‌ బ్యూటీ రీ ఎంట్రీ | Nagma To Play Allu Arjun Mother in Trivikram Srinivas Movie | Sakshi
Sakshi News home page

మరో సీనియర్‌ బ్యూటీ రీ ఎంట్రీ

Feb 19 2019 10:05 AM | Updated on Feb 19 2019 10:05 AM

Nagma To Play Allu Arjun Mother in Trivikram Srinivas Movie - Sakshi

ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్స్‌గా ఇండస్ట్రీని ఏళిన భామలు ఇప్పుడు అత్త, అమ్మ పాత్రల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ హీరోలకు గ్లామర్స్‌ మధర్స్‌గా అలరిస్తున్నారు. ఇప్పటికే నదియా, ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్స్‌ తల్లి పాత్రల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సీనియర్‌ నటి చేరనున్నారు. 90లలో గ్లామర్‌ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నగ్మా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే నదియా, ఖుష్బూలను పవర్‌ ఫుల్‌ రోల్స్‌లో చూపించి మెప్పించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే నగ్మా రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్‌ ఈ సినిమాలో నగ్మా, బన్నీ తల్లి పాత్రలో కనిపించనున్నారట. 2002 లో రిలీజ్‌ అయిన నిను చూడక నేనుండలేను సినిమాతో చివరిసారిగా తెలుగు తెరపై కనిపించిన నగ్మా ఇన్నేళ్ల తరువాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తుండటం సినిమాకు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement