మాంత్రికుడి పాత్రలో మన్మధుడు..? | Nagarjuna Plays Conjurer in rajugari gadhi 2 | Sakshi
Sakshi News home page

మాంత్రికుడి పాత్రలో మన్మధుడు..?

Nov 26 2016 10:52 AM | Updated on Jul 15 2019 9:21 PM

మాంత్రికుడి పాత్రలో మన్మధుడు..? - Sakshi

మాంత్రికుడి పాత్రలో మన్మధుడు..?

యంగ్ జనరేషన్తో పోటిపడి నిలబడేందుకు ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకున్న నాగార్జున వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు

సీనియర్ స్టార్లలో ఇప్పటికీ సూపర్ ఫాంలో ఉన్న స్టార్ హీరో కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్తో పోటిపడి నిలబడేందుకు ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకున్న నాగార్జున వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఊపిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ మన్మధుడు, ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో భక్తిరస చిత్రం 'ఓం నమోవేంకటేశాయ'లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు నాగ్.

రాజుగారి గది సినిమాతో మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు ఓంకార్, ప్రస్తుతం రాజుగారి గది 2 పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీవీపీ సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా నాగ్ పాత్రే సినిమాకు కీలకం అన్న టాక్ వినిపిస్తోంది. హర్రర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ్ మాంత్రికుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే పలు విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న నాగ్ మాంత్రికుడి పాత్రలో నటించటం ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
Advertisement