breaking news
rajugari gadhi 2
-
త ప్లేస్‌లో తా?
మూడో రాజుగారి గదిలోకి ఇటీవల తమన్నా గృహప్రవేశం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే తమన్నా ప్లేస్‌లోకి తాప్సీ రానున్నారని లేటెస్ట్ టాక్. ఓంకార్ దర్శకత్వంలో ఇటీవల ‘రాజుగారి గది 3’ మొదలైంది. ఈ చిత్రాన్ని ఓక్ ఎంటర్‌న్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ‘రాజుగారి గది 2’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి తమన్నా తప్పుకున్నారట. దీంతో చిత్రబృందం తాప్సీతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది తాజా సమాచారం. -
మాంత్రికుడి పాత్రలో మన్మధుడు..?
సీనియర్ స్టార్లలో ఇప్పటికీ సూపర్ ఫాంలో ఉన్న స్టార్ హీరో కింగ్ నాగార్జున. యంగ్ జనరేషన్‌తో పోటిపడి నిలబడేందుకు ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకున్న నాగార్జున వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఊపిరి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ మన్మధుడు, ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో భక్తిరస చిత్రం 'ఓం నమోవేంకటేశాయ'లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడు నాగ్. రాజుగారి గది సినిమాతో మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు ఓంకార్, ప్రస్తుతం రాజుగారి గది 2 పేరుతో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీవీపీ సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించనున్నాడు. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా నాగ్ పాత్రే సినిమాకు కీలకం అన్న టాక్ వినిపిస్తోంది. హర్రర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ్ మాంత్రికుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే పలు విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న నాగ్ మాంత్రికుడి పాత్రలో నటించటం ఇదే తొలిసారి.