పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య! | Nagababu to imitate brother Pawan Kalyan in his next | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య!

Nov 26 2013 11:44 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య! - Sakshi

పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య!

సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.

సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను ఆయన సోదరుడు నాగబాబు అనుకరించనున్నాడు. త్వరలో విడుదల కానున్న 'చూసినోడికి చూసినంత' అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను పోలివుండే కారెక్టర్ ను నాగబాబు పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు అనిల్ వాటుపాలి తెలిపారు. 
 
ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను ఈ చిత్రంలో నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు. ఈ పాత్రలో నటించేటప్పుడు నాగబాబు ఎంజాయ్ చేశారు అని తెలిపారు. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement